అస్సాంలో కూలిపోయిన IAF విమానం-ఐదుగురు మృతి
అమరావతి: అస్సాంలోని జోర్హాట్ రౌరియా విమానాశ్రయంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎగువ అస్సాంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన వైమానిక స్థావరం సమీపంలో ఈ ప్రమాదంలో జరిగినట్టు అధికారులు భావించారు. విమానాన్ని ల్యాండ్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం విమానంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.సమాచారం అందుకున్న రక్షణ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు వాయుసేన ధృవీకరించి, వివరాలను వెల్లడించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ వాయు ఖేమరామ్ కుమావత్ మరియు అగ్నివీర్ వాయు దానిష్ ఆలంలుగా గుర్తించారు.

