DISTRICTS

మొబైల్ లో మాట్లాడుతూడ్రైవింగ్ చేస్తే లైసెన్స్ సస్పెన్షన్

రూ.10 వేలు ఫైన్…

తిరుపతి: సెల్ ఫోన్ వినియోగిస్తూ ద్విచక్ర వాహనాలు నడపుతున్న వారిపై కేసులు నమోదు చేసి, రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ తనిఖీలలో 22 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగింది. మొబైల్ లో మాట్లాడుతూ బైక్ ను నడుపుతున్న పది ద్విచక్ర వాహనాలపై,, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న మరో పది వాహనాలు,, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుతున్న రెండు వాహనాల పై కేసులునమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మోటార్ వాహనాల సెక్షన్ 184 ప్రకారం మొబైల్ ఫోన్  డ్రైవింగ్ చేసేవారికి మొదటిసారిగా Rs.1500,,రెండవసారి అదే వాహనాన్ని వినియోగిస్తూ మొబైల్ డ్రైవింగ్ చేసిన పక్షంలో రూ.10,000 వరకు అపరాధ రుసుము ఉంటుందని తెలిపారు. మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీమతి అతికా నాజ్ మాట్లాడుతూ మొబైల్ డ్రైవింగ్ చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్ లను మూడు నెలల వరకు సస్పెండ్ చేయటానికి సిఫారసు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సహాయ మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీమతి స్వర్ణలత పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *