DISTRICTS

ప్రతిరోజు గార్బేజిల నుంచి చెత్తను సేకరించి తరలించండి- కమిషనర్ వై.ఓ. నందన్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను క్రమం తప్పకుండా చేపడుతూ, 24 గంటల లోపునే గార్బేజిల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేసేలా సిబ్బందిని పర్యవేక్షించాలని కమిషనర్ వై.ఓ నందన్ శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.పబ్లిక్ హెల్త్ విభాగం, వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులతో వారాంతపు సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 24 గంటల్లో గార్బేజిల నుంచి చెత్తను సేకరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని, ఇంటింటి చెత్త సేకరణలో తప్పనిసరిగా తడి, పొడి చెత్తను విడిగా సేకరించేలా పారిశుద్ధ్య సిబ్బందిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. శానిటేషన్ మేస్త్రీలు విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వ్యాపారాలకు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి అని, సచివాలయాల వారిగా సంబంధిత శానిటేషన్ కార్యదర్శులు నూతన వ్యాపారాలను గుర్తించి వ్యాపారస్తులంతా ట్రేడ్ లైసెన్సులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *