AP&TG

పారిస్,స్విట్జర్లాండ్,టర్కీ కంటే ఏపీలో అధ్భుతమైన ప్రకృతి అందాలున్నాయి-రామ్ దేవ్ బాబా

అమరావతి: రాజకీయ నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ తరువాత చంద్రబాబుతోనే నాకు ఎక్కువ స్నేహం వుందని,, చంద్రబాబు వయస్సు పెరుగుతున్నకొద్దీ ఆయన మరింత చలాకీగా తయారవుతున్నారని,,సమస్యలు ఎదురవుతున్న కొద్దీ ఆయన మరింత బలంగా నిలుస్తున్నారని   యోగా గురువు రామ్ దేవ్ బాబా అన్నారు..శుక్రవారం విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు..ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని యోగా గురువు అన్నారు..ఉత్తర భారత్ వాసులకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు చాలా తెలియవని, వాటి గురించి పరిచయం చేయాలని నేను భావిస్తున్నానని తెలిపారు..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దార్శనికత తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఓ గొప్ప వరమని రామ్‌దేవ్ బాబా అన్నారు..ఏపీలో ఉన్న పర్యాటక విధానం ఎంతో ఆకర్షణీయమన్నారు..సృజన, ప్రొడక్టివిటి, ప్రొఫెషనలిజం, సమర్థత, నిబద్ధతలు వున్న వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించారు..ఏపీలో హార్సిలీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రమరం, పిచ్చుక లంక, సూర్యలంక లాంటి మంచి ప్రాంతాలు ఉన్నాయని యోగా గురువు తెలిపారు..పారిస్, స్విట్జర్లాండ్, టర్కీ ఇలాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్నాం కానీ మనదేశంలో మరిన్ని అందాలున్నాయన్నారు..ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు..నదీ తీరం, సముద్ర తీరాలు, సుందరమైన ప్రకృతి వనరులు ఏపీ సొంతమని తెలిపారు..దిండి లాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్ క్రూయిజ్ లేదా బోట్ లాంటి ప్రాజెక్టు చేపట్టవవచ్చన్నారు..భారతీయ సంప్రదాయ పరంగా వివాహాలు జరిపించేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు.. ఏపీలో పతంజలి సంస్థ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోందని వెల్లడించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *