ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అవును నిజమే-షరతులు వర్తిస్తాయి-ఇరాన్.
ప్రధాని నరేంద్ర మోదీ:-
అమరావతి: గత మూడు నెలలుగా ఇరాన్-అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం దాదాపు తుది దశకు చేరుకున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందం (MoU) కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.ఈ విషయమై ఇరాన్ వార్తా సంస్థ మెహ్రా న్యూస్ వెల్లడించింది.అయితే ఇరాన్ విధిస్తున్న షరతులు ఏ మేరకు అమెరికా అంగీకరిస్తుందొ వేచి చూడాలి…
ఇరాన్ విధించిన షరతులు:-
- శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత 60 రోజులపాటు ఇరు దేశాలు కీలక అంశాలపై చర్చలు జరపుతారు.
- ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ప్రాంతీయ భద్రత, ఆర్థిక ఆంక్షలు వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉండనున్నాయి.
- ఇరాన్ 30 రోజుల్లో పూర్తిగా హోర్ముజ్ జలసంధిని తెరవాల్సి ఉంటుంది.
- ఇరాన్ రేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని 30 రోజుల్లో తొలగించాలి.
- ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు.
- ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రణాళిక సమర్పించాలి. ఇరాన్ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అమెరికా దళాలను పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు కట్టుబడి ఉండాలి.
- అమెరికా స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్లను విడుదల చేయాలి. చర్చల ప్రారంభానికి ముందే వీటిల్లో సగం విడుదల చేయాలి.
- లెబనాన్ సహా ఇరాన్ మిత్రపక్షాలపై తక్షణమే దాడులను నిలిపివేయాలి.
- ఒప్పందం అమలుకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తుది ఒప్పందాన్ని ఐరాస భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించాలి.
ప్రధాని నరేంద్ర మోదీ:- అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడమే కాకుండా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా ద్వారా ప్రధాని మోదీ స్పందించారు. సుస్థిరమైన తుది ఒప్పందం కుదిరేలా, మిగిలిన అంశాలపై కూడా సానుకూల చర్చలు కొనసాగుతాయని ఆశిస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు.

