AP&TGNATIONAL

నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్

అమర స్థూపం వద్ద వీర జవాన్లకు ఘన నివాళి…

అమరావతి: భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. అమరస్థూపం వద్ద వీర జవాన్లకు పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వందనం సమర్పించారు. కల్నల్ ఆర్.కె. ఆనంద్, కెప్టెన్ రోహిత్ గార్గ్ నేతృత్వంలో ఈ వందన సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల జీవితాలను సైనికాధికారులను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించారు. సైనికుల ప్రాణత్యాగాల తాలూకు ఔన్నత్యాన్ని తెలుసుకునే అవకాశం దక్కడం, వారికి నివాళులు అర్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *