AP&TG

అక్టోబర్ 13వ తేది నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

అమరావతి: అక్టోబర్ 12వ తేదిన ఉత్తర అండమాన్ సముద్రంపై ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 13వ తేది నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది అక్టోబర్ 15వ తేది నాటికి దక్షిణ బంగాళాఖాతం,దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుందని వెల్లడించింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *