NATIONAL

జూలై మూడో వారం నుంచి దేశవ్యాప్తంగా వర్షాలు కురుసే ఆవకాశం-ఐఎండీ

అమరావతి: జూన్ చివరి వారంలో దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అనంతరం క్రమేఫి బలహీన పడ్డాయి. దినికి కారణం….ఎల్‌నినో,, వాన‌లు లేక ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.ఇప్పటి వరకు మందగించిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఈ అల్పపీడన ప్రభావంతో జూలై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ప్రధానంగా మధ్య భారత్‌, దక్షిణ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడన వ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే కొద్దీ దేశంలోని అంతర్గత ప్రాంతాలలో మేఘాలు దట్టంగా అలముకుని, రాబోయే వారం రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *