NATIONAL

E20 ఇంధనం వల్ల మైలేజీలో తగ్గుదల కనిపించలేదు- IIT కాన్పూర్‌ సైంటిస్ట్ ధృవ్ రాజ్ కరణ

అమరావతి: కొత్త లేదా పాత వాహనాల్లో ఇంధన సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల కనిపించలేదని, అలాగే E20(20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంజిన్లకు హాని చేస్తుందనడానికి ‘ఎటువంటి ఆధారాలు లేవని’ తమ అధ్యయనాలు కనుగొన్నాయని ఐఐటి కాన్పూర్ పరిశోధకులు మంగళవారం ప్రకటించారు. IIT కాన్పూర్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని ఇంజిన్ రీసెర్చ్ లాబొరేటరీకి చెందిన ప్రాజెక్ట్ సైంటిస్ట్ ధృవ్ రాజ్ కరణ,వార్త సంస్థతో మాట్లాడుతూ,, E20 ఇంధనాన్ని వాడినప్పుడు ఇంధన సామర్థ్యంలో వాస్తవ తగ్గుదల 5% కంటే తక్కువగా ఉంటుందని తమ పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలు కేవలం ఇంజిన్‌ను మాత్రమే కాకుండా మొత్తం మోటార్‌సైకిల్‌ను (ఛాసిస్‌తో సహా) క్షుణ్ణంగా పరీక్షించారని, తమ పరిశోధనల్లో E20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గినట్లు ఎక్కడా రుజువు కాలేదని కరణా స్పష్టం చేశారు. వివరాల ప్రకారం, బీఎస్4 (BS4) లేదా బీఎస్6 (BS6) ఉద్గార ప్రమాణాలకు (Emission standards) అనుగుణంగా ఉన్న వాహనాలలో E20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల ఫ్యూయల్ పంప్ లేదా ఇంజిన్ పాడైపోయే ముప్పు ఏమాత్రం లేదని పేర్కొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *