కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి
అమరావతి: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో చికిత్సపొందుతూ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్యలతో గత నెల 16వ తేదిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చేరారు. అప్పటి నుంచి అక్కడ ముద్రగడకి చికిత్స జరుగుతోంది.ఈ రోజు సాయంత్రం పరిస్థితి విషమించడంతో ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. ముద్రగడ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి.1953 జనవరి 22న ఆయన జన్మించారు.1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తన జీవిత కాలంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగానూ ఆయన పని చేశారు. ముఖ్యంగా కాపు ఉద్యమ నేతగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది.

