INTERNATIONALNATIONALOTHERS

సీషెల్స్‌ దేశ అత్యున్నత పురస్కారమైన “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్”అందుకున్న ప్రదాని మోదీ

అమరావతి: సీషెల్స్‌ మూడు రోజుల పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిందూ మహాసముద్ర ప్రాంతంపై తనదైన ముద్ర వేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో,ప్రధాని కీలకమైన ‘మహాసాగర్’ సంకల్పాన్ని ముందుకు తీసుకొచ్చారు. భారత్-సీషెల్స్‌ మధ్య దౌత్య సంబంధాలు, సీషెల్స్ స్వాతంత్ర్యం పొంది 50 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రధాని మోదీకి సీషెల్స్‌ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ‘మనందరి ఇల్లు’ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రాంతపు భద్రత, సుస్థిరత, అభివృద్ధి కేవలం ఒక్క దేశానికే పరిమితం కాదని, అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.’మహాసాగర్’ ఒప్పందంతో ఈ ప్రాంతాన్ని ఉపాధి సముద్రంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.

గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’:- సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ప్రధాని మోదీ కనబరిచిన చొరవకు కాను, సీషెల్స్‌ ప్రభుత్వం ప్రధానిని తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని స్వీకరించిన ప్రధాని, దీనిని వాతావరణ మార్పులతో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు అంకితం చేశారు.

శనివారం ప్రధాని మోదీ సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్‌లో, అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో కలిసి సంయుక్త మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తాబేలకు ఆహరం అందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *