AGRICULTUREAP&TGNATIONAL

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణతో రైతుల ప్రయోజనాలు కాపాడాం-ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీ,కర్ణాటక, తెలంగాణా సీఎంల సమావేశం..

అమరవతి/హోసపేట: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర ప్రాంత రైతుల ప్రయోజనాలపై చర్చించడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాలు వేరైనా దేశంగా మనమంతా ఒక్కటేనని, రైతుల సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల రైతులకు సాగునీటిని, ప్రజలకు తాగు నీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం చెప్పారు.2024 ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టులో 19వ నెంబరు గేటు కొట్టుకుపోవటంతో తక్షణం స్పందించి స్టాప్ లాక్ గేట్ అమర్చామని అన్నారు. ప్రాజెక్టు మరమ్మతులో భాగంగా రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏపీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఈ గేట్ల ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. తుంగ భద్ర డ్యామ్ లోని సీఎం చంద్రబాబు 19వ నెంబరు గేటు, కర్ణాటక ముఖ్యమంత్రి 18వ గేటును, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ 17వ గేటును, అలాగే 20 గేటును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముందు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర ప్రాజెక్టు, జలాల వినియోగంపై సమావేశమయ్యారు. మూడు రాష్ట్రాల ప్రయోజనాలపై నలుగురు నేతలు విస్తృతంగా చర్చించారు.

దేశ భవిష్యత్‌కు నదుల అనుసంధానం అవసరం:- 2024లో 19వ గేట్ కొట్టుకుపోయినప్పుడు స్టాప్‌ లాక్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టామని, ప్రస్తుతం 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించి ప్రాజెక్టును మరింత బలోపేతం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని వెల్లడించారు

నీటి వనరుల్ని పొదుపుగా వినియోగించాలి:- ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తెలంగాణా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మూడు రాష్ట్రాల స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *