INTERNATIONALNATIONALOTHERS

వెనుజులాను వణికించిన భూ ప్రకంపనలు-తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు

164 మంది మృతి,మృతుల సంఖ్య పెరిగే అవకాశం..?

అమరావతి: వెనుజులాలో బుధవారం రాత్రి ఒక నిమిషం వ్యవధిలోనే వచ్చిన రెండు భూకంపాల కారణంగా రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయియి. 164 మంది మరణించగా, 970 మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. శిథిలాల కింద లక్షలాది మంది చిక్కుకుని ఉండొచ్చని, దీనివల్ల బారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో వెనెజువెలా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) తెలిపిన వివరాల మేరకు.. మొదటి భూప్రకంపనలు వెనెజువెలాలోని సాన్ ఫెలిపే సమీపంలో రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. దీని భూకంప కేంద్రాన్ని కారకాస్‌కు పశ్చిమంగా సుమారు 284 కి.మీ. దూరంలో గుర్తించారు. క్షణాల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రెండో భూకంపం కారకాస్‌కు పశ్చిమంగా 293 కి.మీ. దూరంలో ఉంది. ఈ విపత్తులో 10 వేల నుంచి లక్ష వరకు ప్రాణ నష్టం జరిగే అవకాశం వుందని అమెరికా భూకంప పరిశోధనా సంస్థ అంచన వేసింది. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

కారకాస్‌తో పాటు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అనేక భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ యంత్రాలు, ప్రత్యేక రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. దెబ్బతిన్న భవనాల వద్ద పోలీసుల భద్రతా ఏర్పాటు చేశారు. ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లవద్దని సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *