9వ అంతస్తు నుంచి క్రిందకు వేసిన రూ.500 నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్‌లు
అమరావతి: ఇన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం పంజాబ్‌లోని మొహాలీ జిల్లా, ఖారర్ రెసిడెన్షియల్ సొసైటీలో ఉన్న అపార్టమెంట్ లో ఆకస్మిక తనిఖీలు చేసింది. నేపధ్యం… గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ లైసెన్సు పొందేందుకు భారీ భూ అక్రమ దందా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి వందల కోట్లు ఆర్జించినట్లు కూడా ఫిర్యాదులు నమోదు అయ్యాయి. సన్‌టెక్ సిటీ ప్రాజెక్టు, ఆ కంపెనీ ప్రమోటర్ అజయ్ సెహగల్, ఏబీఎస్ టౌన్‌షిప్స్ ప్రైవేటు లిమిటెడ్, ఆల్టస్ బిల్డర్స్, ధిర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పరిసరాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించారు. బిల్డర్లు,హౌజింగ్ ప్రాజెక్టులకు చెందిన వ్యక్తలు ఇండ్లల్లో సోదాలు చేపట్టారు.ఈ సోదాలు ఓ ప్రభుత్వ అధికారికి సన్నిహితంగా ఉన్న నితిన్ గోహల్ నివాసం వద్ద తనిఖీలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోదాలు జరుగుతున్న సమయంలో బిల్డింగ్‌లోని 9వ అంతస్తు నుంచి రూ.500 నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్‌ను కిందపడేశారు. చాజు మజ్రాలో ఉన్న వెస్ట్రన్ టవర్స్ ఫ్లాట్ నెంబర్ 906లో రెయిడ్స్ జరిగినట్లు ఢిల్లీ అధికారులు చెప్పారు. మొహాలీతో పాటు చండీఘడ్‌లోని 12 కేంద్రాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నోట్ల కట్టల వున్న బ్యాగులను స్వాధీనం చేసుకుని,సదరు డబ్బును సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

