ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్పరేన్స్ లో పోర్న్ వీడియోలు
అమరావతి: ఢిల్లీ హైకోర్టులో చీప్ జస్టిస్ నిర్ఘంత పోయే సంఘటన బుధవారం జరిగింది.ఒక కేసుకు సంబంధించి వీడియో కాన్పరేన్స్ ద్వారా వాదనలు జరుగుతున్న సమయంలో, అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్లే అయ్యింది. చీఫ్ జస్టిస్ కోర్టురూమ్‌లోనే ఈ ఘటన చోటుచేసుకున్నది. పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ మధ్యలో పోర్న్ వీడియో ప్లే అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన పట్ల కోర్టు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వర్చువల్ కోర్టు వాదనలను నిలిపివేశారు. వర్చువల్ హియరింగ్ జరుగుతున్న సమయంలో రెండు సార్లు ఈ సమస్య ఎదురైనట్లు తెలిసింది. రెండు సార్లు అభ్యంతరకర పోర్న్ కాంటెంట్ ప్లే అయినట్లు చెప్పారు. అయితే వర్చువల్ ప్రోసీడింగ్స్ ను కొనసాగించేందుకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్‌ను షట్‌డౌన్ చేసి మళ్లీ రీస్టార్ట్ ఛేశారు. కొంతసేపు బాగానే వీడియో కాన్ఫరెన్స్ వాదనలు జరిగాయి. మళ్లీ పోర్న్ ప్లే కావడంతో వీడియో కాన్పరేన్స్ సిస్టమ్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేశారు. పోర్న్ వీడియో ప్లే అవుతున్న సమయంలో మీ సిస్టమ్ హ్యాక్ అయినట్లు మెసేజ్ కూడా వచ్చింది. హ్యాక్ అయిన విషయాన్ని ఆటోమెటిక్ వాయిస్ ద్వారా కూడా వినిపించినట్లు చెబుతున్నారు. నిందిత వ్యక్తి వీడియో కాన్పరేన్స్ స్క్రీన్‌ను షేర్ చేసుకుని, పోర్న్ వీడియోలు ప్లే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీధర్ సర్నాబాత్, షిట్జీత్ సింగ్ అకౌంట్ల నుంచి ఆ వీడియోలు ప్లే అయినట్లు తెలుస్తొంది.ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం.-

