DISTRICTS

ఏప్రిల్ నెల 16వ నుంచి జనగణన ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు-కమిషనర్ నందన్

నెల్లూరు: జనగణన కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ తెలియజేశారు. సోమవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జనగణన-2027 అంశంపై విలేకరులతో సోమవారం మాట్లాడారు.

se.census.gov.in వెబ్ లింక్ ద్వారా ప్రజలు తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవచ్చని కమిషనర్ ప్రకటించారు. మే నెల 1వ తేదీ నుంచి ఇంటింటికి జనాభా వివరాలను సేకరించడానికి వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి తమ వివరాలను అందజేయాలని ఈ సందర్భంగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *