DISTRICTS

కార్పొరేషన్ పరిధిలో 43 వేల టిడ్కో ఇళ్లు-అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోండి-మంత్రి నారాయణ

కాలువలపై ఆక్రమణదారులు..

నెల్లూరు: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్, నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ నుడా, కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై ప్రధానంగా సమీక్షించామన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన టిడ్కో ఇళ్ల పనులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. 163 చోట్ల టిడ్కో పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. జూన్ కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 43 వేల టిడ్కో ఇళ్లను మార్చి లోపు సిద్ధం చేస్తామన్నారు. అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. అమృత్, యూ ఐ డీ ఎఫ్ కింద రాష్ట్రంలో 13 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూ.800 కోట్లతో పనులు జరగనున్నాయని స్పష్టం చేశారు.

కాలువలపై ఆక్రమణలు తొలగించండి:- నెల్లూరును ముంపునుంచి తప్పించాలంటే కాలువలపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ఆక్రమణదారులు సహకరించాలని కోరారు. పేదలు ఇళ్ళు కోల్పోతే ప్రత్యామ్నాయం చూపుతామని మాటిచ్చారు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ,కావ్య క్రిష్ణా రెడ్డి,ఇంటూరి నాగేశ్వరరావు,నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్,కమీషనర్ నందన్,కావలి,కందుకూరు మున్సిపల్ కమీషనర్లు,టౌన్ ప్లానింగ్,ఇంజనీరింగ్,పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *