AP&TG

రాష్ట్రంలో 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాల్పులు-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: రానున్న రెండు రోజులు ఎండతీవ్రత ఎక్కువగా ఉండి 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం 54 మండలాల్లో తీవ్రవడగాలులు, 16 మండలాల్లో వడగాలులు, శనివారం 41 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారం (03-04-26)  శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం 19, పార్వతీపురంమన్యం 11, అల్లూరి 2, పోలవరం 3, విశాఖ 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్రవడగాలులు(54) వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం 2,  విజయనగరం 4, మన్యం 2,  పోలవరం 1, అనకాపల్లి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి 2, ఏలూరు 1, ఎన్టీఆర్ 1  మండలాల్లో వడగాలులు(16) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *