DISTRICTSPOLITICS

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నిక

నెల్లూరు: నెల్లూరు (నగరపాలక సంస్థ) కార్పొరేషన్ మేయర్ గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికైంది. దేవరకొండ సుజాత పేరును 40వ డివిజన్ కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించిగా, కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీ లేకపోవడంతో 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను నెల్లూరు కార్పొరేషన్ మేయర్ గా అధికారికంగా ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంకు రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ తదితరులు హాజరైయ్యారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *