AP&TGPOLITICS

వైసీపీ నాయకులకు ముని శాపం ఉంది, వారు నిజాలు చెబితే,తల వెయ్యి ముక్కలయ్యి-నాగాబాబు 

అమరావతి: కులం అనేది జన్మహత వచ్చిందే కానీ ఎవరు కులంను కొరుకుని పుట్టరని జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.జీవితంలో ఎలా బతకాలో మనం నిర్ణయించుకోవచ్చన్నఅభిప్రాయం వ్యక్తం చేశారు.దిగజారుడు  రాజకీయాలకు దూరం వుంటూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నాయకుడుగా వుండాలని అన్నారు. ఆదివారం సోషల్ వీడియో వేదికగా వైసీపీ నాయకులకు కొన్ని ప్రశ్నలతో నిలదీశారు.అయన మాటాల్లోనే…..  వైసీపీ నాయకులకు ముని శాపం ఉంది.. వారు నిజాలు చెబితే.. తల వెయ్యి ముక్కలయ్యి చస్తారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న కులాలు.. చిన్న సంఖ్యలో ఉన్న కులాల వారిని ప్రోత్సహించాలని, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ ప్రకటించారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై శాతం కాపులు ఉన్నప్పటికీ.. బీసీ సోదరుడు కొణతాల రామకృష్ణకు టికెట్ ఇచ్చారు. కాపులు, బీసీలు కలిసి పని చేసి రామకృష్ణను గెలిపించుకున్నారు.2024 ఎన్నికలలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతాలలో కాపు, బలిజలు 20 శాతం వరకు ఉన్నా ఒక్క ఎంపీ సీటు ఇవ్వలేదు.74 అసెంబ్లీ సీట్లలో ఒకే ఒక్క సీటు మాత్రమే కాపులకు ఇచ్చారు.మరి అప్పుడు సోకాల్డ్ వైసీపీ కాపు నాయకులు ఏమైయ్యారు.వంగవీటి రంగాని తిట్టిన గౌతంరెడ్డికి సీటు ఇవ్వడమే కాకుండా… ఫైబర్ నెట్ ఛైర్మన్‌ను చేసింది జగన్ కాదా? కాపులు అని చెప్పుకుంటూ… జగన్‌ను సపోర్టు చేసేవారిని ఒక్కటే అడుగుతున్నా.. కాపు నేస్తం పథకానికి జగన్ పేరు పెట్టుకున్నప్పుడు ఈ సో కాల్డ్ కాపులు ఏమయ్యారు?. అంటూ ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *