మూలపేట బాలికల హైస్కూల్ కు కార్పొరేట్ హంగులు-మంత్రి నారాయణ
జూన్ లో ప్రారంభోత్సవానికి…
నెల్లూరు: మూలాపేట ప్రాంత విద్యార్థినులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించాలనే లక్ష్యంతో DSR ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో నిర్మితమవుతున్న బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన పనులను ఆదివారం రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా పరిశీలించారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యంత ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ భవనాన్ని రాబోయే విద్యా సంవత్సరం జూన్ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామన్నారు.ఈ సందర్బంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు,చదువుతో పాటు ఆటాపాటలకు అనుకూలమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. గడువులోగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కృషితో పాటు DSR ఫౌండేషన్ వంటి సంస్థల సేవా దృక్పథం తోడవ్వడం వల్ల మూలపేట స్కూల్ జిల్లాలోనే ఒక మోడల్ స్కూల్‌గా నిలవబోతోందన్నారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ , మున్సిపల్ మాజీ చైర్మన్ తాళ్ళపాక అనూరాధ ,స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు .

