AP&TGPOLITICS

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ

హైదరాబాద్: ఈ నెల 11వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 336 వార్డుల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. ఇందుకు సంబంధించి పార్టీ అభ్యర్థుల B-ఫారమ్‌లు దాఖలు చేయగా, స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలోని జనసైనికులు, వీరమహిళలు ఉత్సాహంగా పాల్గొని, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జనసేపార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి.రామ్ కోరారు.

జిల్లాల వారీగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య:-

నిజామాబాద్ – 48–కొత్తగూడెం – 22–రంగారెడ్డి – 21–ఖమ్మం – 17–వరంగల్ – 20–నల్గొండ – 46–మహబూబ్‌నగర్ – 44–మహబూబాబాద్ – 5–మెదక్ – 18–కరీంనగర్ – 56–ఆదిలాబాద్ – 39–మొత్తం వార్డులు: 336 గా వున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *