INTERNATIONALNATIONALOTHERS

అఫ్ఘానిస్థాన్‌ తో ఉద్రిక్తతలు-పాకిస్థాన్ లో కిలో టమాటా ధర రూ.700

అమరావతి: పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్టోబర్‌ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన వేశాయి..దీంతో సరుకుల రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి..రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర,మాసం, పాల ఉత్పత్తుల ధరలు అమాంతగా పెరిగాయి.. ఘర్షణల తరువాత పాకిస్థాన్‌లో టమాటా ధరలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి.. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.700 పాకిస్థానీ ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది..అఫ్గాన్‌ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్‌ పండ్ల ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం..

5 వేల లారీల కంటైనర్లు:- పాకిస్తాన్ దాడులకు ఆఫ్ఘనిస్తాన్ ప్రతి దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా రంగం స్తంబించి పోయిందని కాబూల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ తెలిపారు..అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్తాన్ కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు పేర్కొన్నారు..సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5 వేల లారీల కంటైనర్లు నిలిచిపోయినట్లు వెల్లడించారు..దింతో ఇరువైపులా రోజుకు దాదాపు రూ.8 కోట్లు నష్టం వాటిల్లుతుందన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *