వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికేట్ ప్రతి 3 నెలలకు
నవంబర్ 19వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి..
అమరావతి: వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికేట్ మోడల్ ను అనుసరించి,ఒక్కొ వాహనానికి ఒక్కొ విధంగా వుంటుంది. పొల్యూషన్ సర్టిఫికేట్కు సంబంధించి నవంబర్ 19వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ, ‘సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) నిబంధనలు, 2026’ను నోటిఫై చేసింది. ఇవి గతంలో ‘రూల్ 115’ కింద ఉన్న నిబంధనల స్థానంలో అమల్లోకి వచ్చాయి. నవంబర్ 19వ తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పుల్లో బీఎస్-6 వాహనాలకు వెసులు బాటు ఇచ్చింది.
మూడేళ్ల పాటు సర్టిఫికేట్ చెల్లుబాటు:- వ్యక్తిగత భారత్ స్టేజ్-6(BS-VI Non Transport) వాహనదారులకు కేంద్రం వెసులు బాటు కల్పించింది. ఇకపై ప్రతీ సంవత్సరం పొల్యూషన్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మూడేళ్ల పాటు సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే పాత BS-1, BS-2, BS-3 వాహనదారులు,, కేవలం మూడు నెలలకు మాత్రమే సర్టిఫికేట్ వ్యాల్యూను పరిమితం చేసింది.
కొత్త రూల్స్:-
-2020 ఏప్రిల్ తర్వాత కొనుగోలు చేసిన BS-6 వ్యక్తిగత వాహనాలకు ఇప్పటివరకు ఏడాది చెల్లుబాటు తర్వాత మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దీనిని మూడేళ్లు చెల్లుబాటు అయ్యేలా రూల్స్ మార్చారు. వాహనం రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి ఆరేళ్ల వరకు ప్రతీ మూడేళ్లకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఆరేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ప్రతీ సంవత్సరం తీసుకోవాలి. 10 ఏళ్ల తర్వాత ప్రతీ 6 నెలలకు సర్టిఫికేట్ తీసుకోవాలి
-BS 1,2,3,4 వాహనాలకు ఇప్పటివరకు ప్రతీ 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి BS-1,2,3 వాహనదారులు ప్రతీ 3 నెలలకు తీసుకోవాలి. BS-4 వాహనాలకు 6 నెలలుగా నిర్ణయించింది.
– BS-4 కమర్షియల్ వెహికల్స్ కు ప్రతీ 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి.
– BS-6 ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ నుంచి 6 ఏళ్ల వరకు రెండేళ్లకు ఒకసారి సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవాలి. ఆరు నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికి ఒకసారి తీసుకోవాలి. ఆ తర్వాత ఆరు నెలలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది.

