AP&TG

తీరం దాటిన అర్నబ్ తుపాన్-వాతావరణశాఖ

ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు..

కోనసీమలో 6 వేల విద్యుత్తు స్తంభాలు..

దెబ్బతిన్న బీచ్‌ రహదారి..

అమరావతి: గత నాలుగు రోజులుగా రాష్ట్రంను వ‌ణికిస్తున్న అర్నబ్ తుపాను బుధవారం  వేకువ జామున రాత్రి 2 నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతిగా( నరసాపురం) తీరం వద్ద దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అర్నబ్ తీవ్ర తుపానుగా బలహీనపడిందని, తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం దుని వెల్లిడించింది.

ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు:- తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు విశాఖపట్నంలో 216.9 మిల్లీమీట‌ర్లు, కళింగపట్నంలో 147.5 మిల్లీమీట‌ర్లు, తునిలో 123.3 మిల్లీమీట‌ర్లు, కాకినాడలో 118.4 మిల్లీమీట‌ర్లు, మచిలీపట్నంలో 115.2 మిల్లీమీట‌ర్ల వర్షపాతం నమోదైంది.

కోనసీమలో 6 వేల విద్యుత్తు స్తంభాలు:- అనకాపల్లిజిల్లా కాశింకోట మండలం కన్నూరిపాలెంలో 24 గంటల్లో సుమారు 263 మిల్లీమీట‌ర్ల వర్షం కురిసినట్లు నివేదికలు వెల్ల‌డించాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. బలమైన గాలుల కారణంగా కోనసీమ, కాకినాడ ప్రాంతాల్లో విద్యుత్తు మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. కోనసీమలో సుమారు 6 వేల విద్యుత్తు స్తంభాలు నేలకూలిపోయాయి. దాంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు, హోర్డింగులు కూలిపోవడంతో కొన్ని రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి.

దెబ్బతిన్న బీచ్‌ రహదారి:- కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సముద్రపు అలల ఉద్ధృతికి బీచ్‌ రహదారి దెబ్బతిన్నది. తీర రక్షణకు ఏర్పాటుచేసిన రాళ్లు సైతం అలల ధాటికి కదిలిపోయాయి. యానాంలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడి పునరావాస కేంద్రంలోకి నీరు చేరడంతో కొందరిని భవనంలోని పైఅంతస్తుకు తరలించారు. తుపాను కారణంగా విమాన, రైలు, రోడ్డు రవాణా సేవలకు అంతరాయం ఏర్పడింది.

రైళ్లు-విమాన సర్వీసులు రద్దు:- అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తు దక్షణ మద్య రైల్వే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా రైళ్లు రద్దు చేశారు. 26 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే విజయవాడ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు రద్దు చేశారు. నేడు విజయవాడ నుంచి ఇండిగో విమాన సర్వీసులన్నీ రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఫ్లై 91 హైదరాబాద్ విమాన సర్వీసులు,,ఢిల్లీ-విజయవాడ-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్తయ్యేవరకు తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *