AP&TG

బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం- విపత్తుల నిర్వహణ సంస్థ

శుక్రవారం ఉదయం మోస్తరు వర్షాలు..

సోమవారం నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

అమరావతి: ఉపరితల ఆవర్తనం వల్ల బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలిపింది. ఇది సోమవారం నాటికి బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2-3 రోజుల్లో ఇది మరింత బలపడి, ఆంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, సోమవారం(26-10-2026) నుండి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.

శుక్రవారం ఉదయం అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు మధ్యమధ్యలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *