గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఆటు తరువాత 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం నుండి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తిరిగిరావాలని సూచించారు.గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

