కూటమి నేతల మధ్య కొలిక్కి వచ్చిన సర్దుబాటు చర్చలు
నెల్లూరు: కూటమి నేతల మధ్య జరిగిన సర్దుబాట్లు చర్చలు ఒక కొల్కికి వచ్చాయి. సీటిలో 4 డివిజన్లు,రూరల్ లో 4 డివిజన్లతో జనసేన నేతలు అంగీకరించినట్లు సమాచారం.అలాగే బీజెపీకి సీటిలో 3 డివిజన్లు, రూరల్ లో బీజేపీకి 3 కేటాయించినట్లు తెలుస్తొంది. జనసేన సిటీలో 6,15,21,71 డివిజన్లు,, రూరల్ లో 29,30,45,53 డివిజన్లు జనసేన బరిలో నిలవనున్నది. బీజేపీ సీటిలో 7,13,60 డివిజన్లు,,రూరల్ లో బీజేపీ 31,42,43 డివిజన్ల నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. రూరల్ లో జనసేనకు కేటాయించిన 29వ డివిజన్ నుంచి టీడీపీ నుంచి రెబల్ అభ్యర్దులు బరిలో నిలిచారు. నామినేషన్ విత్ డ్రాకు మరి కొన్ని గంటలు సమయం వున్నందున్న టీడీపీ రెబల్ అభ్యర్ది విత్ డ్రా చేసుకుంటాడా? లేక బరిలో నిలుస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

