కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు తెరదీసే అవకాశం-ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
జిల్లా కలెక్టర్ ని కలిసిన ఎమ్మెల్సీ…
అధికార పార్టీ దుర్మార్గాలను అడ్డుకోవాలి..
అధికార పార్టీకి తగిన బుద్ధి చెబుతాం
నెల్లూరు: కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలు, దౌర్జన్యాలకు తెరదీసే అవకాశం ఉందని,అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ని కోరారు.శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో అయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఎలాగైనా గెలవాలని కుతంత్రాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇస్టారీతిలో ఓటర్ లిస్ట్ లను రూపొందించి కొంతమంది ఓటర్లను జాబితా నుంచి మాయం చేయడం చేస్తున్నారని, పోలీసు, రెవిన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ లేని పరిస్థితులను కూటమినేతలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
అధికార పార్టీ దుర్మార్గాలను అడ్డుకోవాలి:- ఇప్పటికే కూటమి పార్టీలు ప్రజాదరణ కోల్పోయాయి కాబట్టి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే తాము గెలవలేమని భావించి ఈ విధమైన అక్రమాలకు తెరతీసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈ విషయాలన్నిటిపై జిల్లా కలెక్టర్ ని కలిసి మాట్లాడి అన్ని విషయాలను కలెక్టర్ కి వివరించడం జరిగిందన్నారు. అధికార పార్టీ దుర్మార్గాలను అడ్డుకోవాలని కలెక్టర్ ని కోరామని తెలిపారు.
అధికార పార్టీకి తగిన బుద్ధి చెబుతాం:- ఈరోజు అధికార పార్టీ పెంచి పోషిస్తున్న విష సంస్కృతిని నెల్లూరులో తీసుకువస్తే అధికార పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అధికార పార్టీ దుర్మార్గాన్ని, ఆగడాలని ఎండగట్టేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకెళుతుందన్నారు. నెల్లూరులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలే తప్ప.. దుర్మార్గాలు, దౌర్జన్యాలు బెదిరింపులతో గెలవాలని కూటమినేతలు చేస్తున్న పన్నాగాలు ఫలించవన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

