DISTRICTS

సాధారణ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న- కమిషనర్ నందన్

నెల్లూరు: సాధారణ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావాలని, అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరు సహకరించాలని  కమిషనర్/అడిషనల్ ఎలక్షన్ ఆఫీసర్ వై.ఓ నందన్ కోరారు.శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరగనున్న సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కమిషనర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

నగరపాలక సంస్థ పరిధిలోని 72 డివిజన్లు:- ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 72 డివిజన్లకు సంబంధించిన సమగ్ర ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రకటించామని, నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలింగ్ స్టేషన్ల వివరాలపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలియజేయాలని సూచించారు.

ఓటర్ల నిష్పత్తికి తగ్గట్టుగా:- డివిజన్ల వారీగా వివిధ ప్రభుత్వ పాఠశాలలు ఇతర కార్యాలయాలను గుర్తించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని వసతులతో కూడిన నూతన పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు అందజేయాలని సూచించారు. ఓటర్ల నిష్పత్తికి తగ్గట్టుగా వివిధ డివిజన్లకు అవసరమైన నూతన పోలింగ్ స్టేషన్లను కూడా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ రఘునాథరావు, ఎన్నికల లైజనింగ్ అధికారి రాజేంద్రప్రసాద్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *