NATIONAL

యూపీలో తయారైన బ్రహ్మోస్, ఏకే-203 పాకిస్థాన్‌కు ‘నిద్రలేని రాత్రులు’ మిగిల్చుతున్నాయి-అమిత్ షా

అమరావతి: ఆపరేషన్ సింధూర్ తరువాత బ్రహ్మోస్‌ క్షిపణి విధ్వసం చూసి పాకిస్థాన్‌కు నిద్ర పట్టడడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు.శుక్రవారం అంతర్జాతీయ ట్రేడ్‌ షో 4వ ఎడిషన్‌ను కేంద్ర హోం మంత్రి గ్రేటర్‌ నొయిడాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా బ్రహ్మోస్‌ క్షిపణుల ధాటికి భారత్‌ ముందు పాకిస్థాన్‌ మొకరిల్లాల్సి వచ్చిందన్నారు.దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ భారీగా పెరిగిందని అలాగే 80 దేశాలకు మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. అమేఠీలో తయారైన AK-203 అసాల్ట్‌ రైఫిల్స్‌ ఉగ్రవాదుల అంతమొందిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి ఉపు అందుకొవడంతో మన రక్షణ ఉత్పత్తి రూ.1,78,000 కోట్లను దాటిందని తెలిపారు. 2013-14తో పోలిస్తే రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో 56 రెట్లు వృద్ధి సాధించామన్నారు.

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ విధానాలతొ:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఉన్న రాజకీయ స్థిరత్వాన్ని అమిత్​ షా కొనియాడారు. వరుసగా మూడు పర్యాయాలు ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న ప్రధాని మోదీ, విధానాలను రూపొందించడమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా పరివేక్షించడంతో, భారత్​ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్​ తన వృద్ధి రేటును నిలబెట్టుకోవడమే కాకుండా దానిని మరింత వేగవంతం చేసిందని షా అన్నారు. 2047 ఆగస్టు 15 నాటికి భారత్​ అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందన్న మోదీ సంకల్పం నిజమౌతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

యోగి ప్రభుత్వ మాఫియాను:- ఉత్తర్​ప్రదేశ్​లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మాఫియాపై ఉక్కుపాదం మోపిందని అమిత్​ షా ఉద్ఘాటించారు. మాఫియా శక్తులను తుడిచిపెట్టడానికి ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని నొక్కి చెప్పారు. ఆపై, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. 2017లో బీజేపీ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆయన గుర్తు చేసుకున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *