AP&TG

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం-మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని,దిని ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద లేదా భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడకూదని సూచించారు.

రానున్న 3 రోజుల వాతావరణం వివరాలు:-

గురువారం: శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు.

శుక్రవారం-శనివారం: ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *