శని,ఆది వారాల్లో పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు-జిల్లా ఎన్నికల యంత్రాంగం
బూత్ లెవల్ ఆఫీసర్స్ ఎక్కడా???
ప్రకటనలకే పరిమితం???
నగరపాలక సంస్థ కమీషనర్ సీటి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూన్న నేపధ్యంలో, పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలించేందుకు గత శని,ఆదివారల్లో కలెక్టర్ కార్యాలయంకు ఎదురుగా వున్న స్కూల్ వెళ్లడం జరిగింది.అయితే అక్కడ 11 గంటలకు వరకు ఆఫీసు తలుపులు కూడా తీయ్యాలేదు. మరి ముసాయిదా ఓటర్ల జాబితలను ఎక్కడ పరిశీలించాలి,మార్పులు చేర్పులు ఎక్కడ చేసుకోవాలి.కలెక్టర్ పై వున్న గౌరవంతో ఆఫీసుకు తాళ్లం వేసి వున్న ఫోటోలను పబ్లిష్ చేయలేదు. మరి రేపు కూడా ఇదే పరిస్థితి వున్నట్లయితే,ఖచ్చితంగా ఏ విషయంను ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. మంత్రి దృష్టి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది. BLO వైపు నుంచి జరుగుతున్న నిర్లలక్ష్యంను వెంటనే సరి చేస్తారని ఆశిస్తున్నాము.
నెల్లూరు: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) లో భాగంగా 01.07.2026 అర్హత తేదీ ఆధారంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు-అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 05-09-2026 (శనివారం)-06-09-2026 (ఆదివారం) తేదీలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఈ ప్రత్యేక తేదీలలో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) తో కలిసి ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటారు.
పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు, ASDD జాబితాలు, అలాగే అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8 లను అందుబాటులో ఉంచి, ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసి, దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఈ ప్రత్యేక శిబిరాలలో ముఖ్యంగా 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మరియు అర్హత గల యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు, అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని పౌరులు, పేరు లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైన వారు, అలాగే అభ్యంతరాలు లేదా తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. కావున ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం కోరుతున్నాము.

