DEVOTIONALDISTRICTSOTHERS

అమ్మవారి సేవ… పూర్వజన్మ సుకృతం-మంత్రి నారాయణ

నవాబుపేట మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన..

1.01 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం..

నవాబుపేటలో ఆధ్యాత్మిక సందడి..

 నెల్లూరు: నగరంలోని నవాబుపేటలోని అత్యంత ప్రాచీనమైన బలిజ వారి శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరగగా, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తన సతీమణి రమాదేవితో కలసి పాల్గొని వాస్తు పూజ, అమ్మవారి హోమం నిర్వహించారు. పూర్ణకుంభంతో స్వాగతం అందుకున్న మంత్రి దంపతులు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడరు..అమ్మవారి సేవ చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, 2019లోనే ఆలయ స్థల సేకరణ కోసం 23 అంకణాల స్థలానికి  28 లక్షలు అందించామని, ప్రస్తుతం దాతల సాయంతో 1.01 కోట్ల అంచనా వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నామని వెల్లడిస్తూ, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి పురపాలక శాఖ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణానికి దేవస్థాన కమిటీ, బలిజ సంక్షేమ నాయకులు, దాతలకు అభినందనలు తెలిపిన మంత్రి, భక్తులందరూ ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డివిజన్‌కు విచ్చేసిన మంత్రికి స్థానిక మహిళలు రాఖీలు కట్టగా ఆయన వారికి స్వీట్లు తినిపించి ఆప్యాయత చాటుకోగా, కార్యక్రమం అనంతరం డాక్టర్ పోకల రవి (5 లక్షలు), పప్పు నారాయణ (2 లక్షలు), సుబ్రహ్మణ్యం ( 1 లక్ష), రంగయ్య నాయుడు ( 25 వేలు) ముందుకు వచ్చి మొత్తం 8.25 లక్షల నగదు విరాళాలను మంత్రి నారాయణకు అందజేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ, నగరాధ్యక్షుడు మామిడాల మధు, 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *