చిలుకలూరిపేట వద్ద ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు-7 మంది మృతి
అమరావతి: చిలుకలూరిపేట వద్ద గురువారం ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సు విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో ప్రకాశం జిల్లా కొండ మంజులూరు నుంచి వేలూరు వెళుతుండా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని గుంటూరు జీజెహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు చిలుకలూరిపేట మండలం వేలూరుకు చెందిన బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, సువార్తమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

