AP&TG

ఆరెంజ్ అలెర్ట్-పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: ఉపరితల ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.ఇతర జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవవచ్చన్నారు. ఆరెంజ్ అలెర్ట్:- కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 40-50కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి,చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని సూచించారు.

ఉష్ణోగ్రతల అంచన సోమవారం:- 42°C – 44°C: పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

40°C – 42°C:  పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు వున్నాయన్నారు.

ఆదివారం ఉష్ణోగ్రతలు:- పల్నాడు జిల్లా అచ్చంపేటలో 44.3 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 43.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా ఉయ్యూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 43.7, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.6, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.4, తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 43.3, బాపట్ల జిల్లా కారంచేడులో 43, గుంటూరు జిల్లా మంగళగిరిలో 42.7 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *