ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన గాయత్రి-ట్రీసా
అమరావతి: భారత బ్యాడ్మింటన్ అభిమానుల ఆశలను నిలపెడుతూ దాదాపు 15 సంవత్సరాల తరువాత ఒక చారిత్రాత్మక విజయం సాధించారు.ఎలాంటి అంచనలు లేని గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడి, శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అరీనాలో జరిగిన 2026 BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో తమ అద్భుతమైన ఆటతో కాంస్య పతకం సాధించారు.యువతులు సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ అలాగే టాప్ సీడ్స్ అయిన చైనాకు చెందిన లియు షెంగ్ షు-టాన్ నింగ్‌ల చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. అయితే మహిళల డబుల్స్ విభాగంలో భారత్ చివరిసారిగా 2011లో పతకం సాధించింది. అప్పట్లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప కూడా కాంస్యం గెలిచారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అదే విభాగంలో ట్రీసా-గాయత్రి కాంస్యం గెలిచి రికార్డు నెలకొల్పారు.
మ్యాచ్‌ను చైనా జోడీ దూకుడుగా ప్రారంభించినా, భారత షట్లర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం ప్రదర్శించిన ట్రీసా-గాయత్రి తొలి గేమ్‌ను 21-18 తో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో ఇరు జట్ల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. స్కోరు 12-12తో సమం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే ఆ తర్వాత టాన్ నింగ్-లియు షెంగ్షు జోడీ ఒక్కసారిగా పుంజుకుని వరుస పాయింట్లు సాధిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచిన చైనా షట్లర్లు రెండో గేమ్‌ను 21-13తో గెలిచారు. దీంతో మ్యాచ్ నిర్ణాయత్మక మూడో గేమ్‌లో మాత్రం ట్రీసా-గాయత్రి జోడీ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఆరంభం నుంచే చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించింది. భారత షట్లర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-8తో మూడో గేమ్‌ను ముగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

