తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు,మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య?
నేను తప్పు చేయాలేదు-మరి ఎవరు చేశారు?
అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆదివారం ఉదయం రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఉరివేసుకుని మరణించారు. కనిపించారు. రాంపూర్‌హట్‌లోని తన నివాసానికి ఆనుకుని ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆశిష్ బెనర్జీ, రాంపూర్‌హట్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 2001 నుండి 2026 వరకు వరుసగా 25 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ధ్రువ సాహా చేతిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు.
టీఎంసీలో పార్టీలోని “తప్పులను” తాను ఎప్పుడూ వ్యతిరేకించలేక పోయాను:- ఆత్మహత్య ఉత్తరంలో, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని రాసుకున్నాడు. తాను చైర్మన్‌గా వ్యవహరించిన తారాపీఠ్ రాంపూర్హట్ డెవలప్‌మెంట్ అథారిటీ (TRDA)కి సంబంధించిన అక్రమాల ఆరోపణల గురించి ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పట్టణ ప్రణాళిక మరియు అభివృద్ధి సంస్థకు సంబంధించిన టెండర్ నిర్ణయాలు, చెక్కుల జారీ, ప్రణాళికల ఆమోదం లేదా ‘నో-అబ్జెక్షన్’ సర్టిఫికెట్ల విషయంలో తనకు ఎలాంటి పాత్ర లేదని బెనర్జీ పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించిన ఆయన, రాజకీయాల్లోకి రావడం పొరపాటని తనకు అనిపిస్తోందని అన్నారు. పార్టీలోని “తప్పులను” తాను ఎప్పుడూ అంగీకరించలేకపోయినప్పటికీ, వాటిని వ్యతిరేకించలేకపోయానని కూడా టీఎంసీ నాయకుడు అయిన ఆశిష్ బెనర్జీ రాశారు.తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని ఆ ఉత్తరం చివరలో ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత బెనర్జీ రాజకీయాల్లో పెద్దగా చురుకుగా కనిపించలేదని, పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్న పార్టీ వర్గాలు తెలిపాయి.

