UPI చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోము-ఫోన్‌పే సీఈఓ
అమరావతి: “భారతీయ వినియోగదారులందరికీ UPI సేవలు ఉచితం ఇకపై కూడా అలాగే కొనసాగుతాయి!” అని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ శనివారం సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. UPI ద్వారా చెల్లింపులు జరిపినందుకు వినియోగదారుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయడం జరగదని స్పష్టం చేశారు. UPI లావాదేవీలపై ఛార్జీల వసూలుకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో, డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు.


