రష్యాపై ఆంక్షలు విధించే బిల్లును ఆమోదించిన అమెరికా సేనేట్
భారత్, చైనాతో పాటు 5 దేశాలపై ప్రభావం..
అమరావతి: రష్యాపై ఆంక్షలు విధించే బిల్లును శుక్రవారం అమెరికా సేనేట్ ఆమోదించింది.రష్యా వద్ద ఇంధనం, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై దాదాపు 100 శాతం వరకు అమెరికా టారిఫ్ విధించే అవకాశాలు ఉన్నాయి. రష్యా వద్ద ఆయిల్ కొనడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, దీని వల్ల ఆ దేశం ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో రష్యా మీద ఆధారపడే దేశాలను కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా దగ్గర ఆయిల్ కొనే దేశాలపై 100 శాతం టారిఫ్ విధించే అవకాశాలు ఉన్నాయి. భారత్, చైనాతో పాటు మొత్తం 5 దేశాలపై ఆ ప్రభావం పడనున్నది.

