AP&TG

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటల్లోపు వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.  ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్ , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించారు.

శనివారం:  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,  ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *