వైసీపీ చేయాల్సింది నిరసన దీక్షలు కాదు, ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
రుజువు చేసిన గంటలో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
టీచర్ ఉద్యోగాలను అడ్డుకోవాలని 300 కేసులు హైకోర్టులో వేశారు..
రూరల్ లో పూర్తిస్థాయి అభివృద్ధి జరగాలంటే మరో 3వేల కోట్లు..
నెల్లూరు: కూటమి అధికారంలోకి వచ్చాక 26 నెలల్లో రూరల్ లో 857 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, కొన్నిపనులు జరుగుతున్నాయని, మరి కొన్నింటికి టెండర్లు పిలవనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం పరిధిలో 17 కోట్లతో 168 పనులు పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన ప్రారంభం చేసి ప్రజలకి అంకితం చేస్తున్నమన్నారు. నేను మూడవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గత రెండు సార్లు పూర్తి చేయలేని అభివృద్ధి పనులు ఈ సారి చేస్తున్నమన్నారు. రూరల్ లో పూర్తిస్థాయి అభివృద్ధి జరగాలంటే మరో 3వేల కోట్ల రూపాయల నిధులు కావాలని తెలిపారు.
వైసీపీ నాయకులు తప్పడు ప్రచారం:- వైసీపీ చేయాల్సింది నిరసన దీక్షలు కాదు, ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే,ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారన్నారు. వైసీపీ ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలు లోకేష్ ఇచ్చాడని,అది చూసి తట్టుకోలేక పేకాటలో గెలిచిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారంటూ వైసీపీ నాయకులు తప్పడు ప్రచారం చేస్తున్నరని విమర్శించారు.ఒక అలాంటి సంఘటన జరిగి వుంటే రుజువులతో నిరూపించాలని, అలా రుజువు చేసిన గంటలో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాని అన్నారు. టీచర్ ఉద్యోగాలను అడ్డుకోవాలని 300 కేసులు హైకోర్టులో వేశారని, వీళ్ళకి హైకోర్టు మొట్టికాయలు వేసినా వారిలో మార్పు రాకపోవడం దారుణం అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ సాబీర్ ఖాన్, కో క్లస్టర్ ఇంచార్జ్ విష్ణు ప్రియ పాల్గొన్నారు.

