BUSINESSNATIONALOTHERS

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ

వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు..!

వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లు దాటిన వ్యాపారులు మాత్రమే..!

అమరావతి: UPI (యూపీఐ) లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007, సవరణ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఛార్జీలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా ఇప్పటివరకు యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రద్దు అవుతుంది.

వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు:- కొత్త చట్టం ద్వారా UPI లావాదేవీలపై కూడా వ్యాపారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టం వెంటనే అమలులోకి రాకపోవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ ఛార్జీలు వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారులే చెల్లించాల్సి వుంటుంది. అది కూడా వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లు దాటిన వ్యాపారులు మాత్రమే స్వల్ప మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలి.అటు తరువాత రాష్ట్రపతి అంగీకారం తెలపాలి. ఆ తర్వాత ఈ బిల్లు చట్టంగా అమలులోకి వస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *