భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి ఇజ్రాయెల్ సిద్ధం- నెతన్యాహు
అమరావతి: భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. సోమవారం ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని, భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రపంచ వేదికపై ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతు అందిస్తున్న దేశాల్లో భారత్ కీలకమైనదని నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ ఒంటరిగా ఉందనే ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. భారత్‌తో పాటు పలు దేశాలతో ఇజ్రాయెల్ దౌత్య, ఆర్థిక, సాంకేతిక, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతోందని వెల్లడించారు. భారత్‌లో ఇజ్రాయెల్‌కు లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని నెతన్యాహు అన్నారు.

