సచిన్ టెండూల్కర్‌కు, సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించిన బీబీసీఐ
అమరావతి: టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ, సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది…శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్‌ను అవార్డుతో సత్కరించనున్నది.. భారత క్రికెట్‌కు దిగ్గజ ఆటగాడు అయిన సచిన్ అందించిన సేవలు అమోఘమని బీబీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.. ఈ పురస్కారాన్ని స్వీకరించనున్న 31వ ఆటగాడు సచిన్ టెండూల్కర్..గతంలో ఇండియా క్రికెట్ టీమ్ మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి,, లెజెండరీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ సహా పలువురు ఈ అవార్డును అందుకున్నారు.. సీకే నాయుడు 1916 నుంచి 1963 వరకు సుదీర్ఘంగా 47 సంవత్సరాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా కొనసాగారు..1994లో భారత జట్టు తొలి కెప్టెన్ కర్నల్ సీకే నాయుడు గౌరవార్థం ఈ అవార్డును బీసీసీఐ ప్రవేశ పెట్టింది..