మన ముందున్న ఏకైక లక్ష్యం,వికసిత్ భారత్ నిర్మాణమే-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
అమరావతి: ప్రపంచం వేదికపై భారత్‌ను 3వ ఆర్థిక శక్తిగా నిలపే దిశగా అడుగులు వేస్తూన్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు..శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు..దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమన్నారు..భారతదేశ సనాతన,, సామాజిక చైతన్యనికి మహాకుంభమేళా నిదర్శంగా నిలుస్తోందన్నారు.. దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు..తమ ప్రభుత్వ 3వ సారి పాలన చేపట్టిన తరువాత మూడు రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతోందని రాష్ట్రపతి చెప్పారు..
బడ్జెట్-2025లో రైతులు,,మహిళలు,,పేదలు,,యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం.. రూ.70 వేల కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం.. 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నాం..దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యం..పేద,, మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్ సబ్సిడీ ఇస్తున్నాం..ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం..25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం..పన్ను విధానాలను సరళీకరించాం..చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నాం..70 ఏళ్లు దాటిన 6 కోట్ల దేశ ప్రజలకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం.. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. దేశంలో 1,15,000 మంది మహిళలు కోటీశ్వర్లుగా మారారు.. 3.00.000 మంది మహిళలను కోటీశ్వర్లుగా మార్చాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం.. సామాజకి,,ఆర్థిక,, రాజకీయ సుస్థిరతలో ఈ ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచింది.. మన ముందున్న ఏకైక లక్ష్యం,, వికసిత్ భారత్ నిర్మాణమే అని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తన ప్రసంగంలో వివరించారు.