మయన్మార్,థాయ్‌లాండ్,చైనాలో రిక్టరు స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం
అమరావతి: ధరణి ప్రకోపానికి మయన్మార్,థాయ్‌లాండ్,చైనాలో తీవ్ర భూకంపనలు చోటు చేసుకోవడంతో ఈ మూడు దేశాల ప్రజలు వణికిపోయారు..శుక్రవారం ఉదయం రిక్టరు స్కేలుపై 7.7 తీవ్రతతో మయన్మార్ బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి..యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రారంభ భూకంపం 7.7 తీవ్రతతో నమోదైందని,,దీని కేంద్రం మయన్మార్‌లోని సాగింగ్‌కు వాయువ్యంగా దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది.. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు చిగురుటాకుల్లా ఊగిపోగా,,పలుచోట్లు ఎత్తైన భవనాలు నేలకూలినట్లు స్థానిక మీడియా వెల్లడించింది..ఈ భూ ప్రకంపనలతో మయన్మార్‌లోని మండలేలో గల ఐకానిక్ అవా వంతెన కుప్పకూలిపోయింది. ఇరావడీ నదిలోకి వంతెన కూలిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి..ఇదే సమయంలో ఈ భూకంపం కారణంగా థాయ్‌లాండ్‌లో కూడా భూమి కంపించింది.. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు (USGS) తెలిపింది..అలాగే చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి..చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్స్ లో భూమి కంపించినట్లు బీజింగ్ జియోలాజికల్ సర్వే తెలిపింది..ఈ ప్రకంపనలు రిక్టరు స్కేలుపై 7.9 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది.. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.. భూకంపం తీవ్రత భారీ స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు..ప్రాణ,ఆస్తి నష్టం అపారంగ వుండే అవకాశం?