ఖట్మాండూలో విమాన ప్రమాదం-18 మంది మృతి
అమరావతి: నేపాల్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది..ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోప్పోయారు.. నేపాల్ రాజధాని ఖట్మాండూలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.. శౌర్య ఎయిర్‌లైన్స్ కు చెందిన 9N-AME విమానం ఖట్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోఖార్‌కు వెళ్లెందుకు విమానం రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో టైర్ స్కిడ్ అయ్యి రన్‌వే అంచున ఉన్న పెన్సింగ్‌ను ఢీ కొట్టి కుప్పకూలిపోయింది.. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 19 మంది సాంకేతిక సిబ్బంది ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది..అందులో 18 మంది ప్రాణాలు కోల్పోగా, పైలట్ మనీశ్ షక్య(37)కు తీవ్ర గాయాలు అయ్యాయి..గ్రౌండ్ రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు..పైలట్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.,ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.