ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను-నూతన కమిషనర్ సూర్య తేజ,IAS
( జిల్లాకు బదలీపై వచ్చిన ప్రతి అధికారి బాధ్యతలు చేపట్టిన తరవాత మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను….అందరికీ అందుబాటులో వుంటాను..మొదటి రోజు చెప్పే పాత గ్రామ్ ఫోన్ రికార్డులా? అటు తరువాత వారు పరిష్కరించేంది ప్రజల సమస్యలు కాదు,,,నాయకుల సమస్యలు అనేది నగ్న సత్యం..నిజంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషిన కమీనర్లల్లో ఢిల్లీరావు..అయన మాటలు చెప్పలేదు…చేతల్లో చూపించారనే నిజం…ఒక వేళ కొత్త అధికారి నిజాయితీగా పనిచేయాలని భావించినట్లయితే…ట్రాన్స్ ఫర్స్ చేసేందుకు జిల్లా మంత్రులు,,జిల్లా స్థాయి నాయకులు ఎల్లవేళల సిద్దంగా వుంటారు…ఇందులో కొస మెరుపు ఏమిటంటే….జిల్లా మంత్రి నారాయణ…పనిచేయాలి అనే మనస్థత్వం వున్నవారు కావడంతో కొంత మేర అయిన ప్రజల సమస్యలు తీరుతాయని నగర ప్రజలు భావిస్తున్నారు….)
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కమిషనర్ మల్లవరపు సూర్య తేజ IAS తెలియజేసారు. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పారదర్శకంగా పాలన అందించేందుకు కృషి చేస్తానని, ప్రజలనుంచి ప్రతిరోజూ అర్జీలు స్వీకరిస్తానని తెలిపారు. నగర పాలక సంస్థ నిర్దేశించిన గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా పర్యవేక్షిస్తానని కమిషనర్ తెలిపారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహించి నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. మంచినీరు, రోడ్లు, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతాను అని అన్నారు.