చిత్తూరు జిల్లా మొగలి కనుమ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
చిత్తూరు: చిత్తూరు-బెంగళూరు ప్రధాన రహదారిపై బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిలో బస్సు, లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు..చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు,, పలమనేరు వైపు నుంచి ఇనుప కమ్మీల లోడ్ తో బెంగుళూరు వైపు వెళ్లుతన్న లారీ ఢీ కొన్నాయి..ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..బస్సు వేగం అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు..ఆర్డీసీ బస్సు డ్రైవర్ మనోహర్తో పాటు ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు తెలుస్తొంది.. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.. నలుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు తరలించారు..మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని,,పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.